రుద్రూర్, బతుకమ్మ: నూతనంగా ఎన్నికైన టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మొదటి సారిగా
నిజామాబాద్ జిల్లాకు వస్తున్న సందర్భంగా, జిల్లా కేంద్రంలో ఈనెల 4న కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్ అన్నారు. గురువారం రుద్రూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన నుండి ఈనెల 4న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు, ఎంపి సురేష్ కుమార్ షేట్కార్, పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు విచ్చేస్తున్నారని అన్నారు. కావున బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట కుమార్, గ్రామ అధ్యక్షులు పార్వతి ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుర్మజి సాయిలు, కర్క అశోక్, గాండ్ల శ్రీను, సుదర్శన్ గౌడ్, చిక్కడపల్లి రవి, శ్రీకాంత్ గౌడ్, షేక్ నిస్సర్, సురేష్ బాబు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.