. . . డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దేశంలో శాంతి, సద్భావనను పెంపొందించే లక్ష్యంతో రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర 35 ఏళ్ల క్రితం ప్రారంభమై, నేటికీ కొనసాగుతోందని డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. శ్రీ పెరంబదూర్ నుంచి ఢిల్లీ వరకు కొనసాగుతున్న 35వ రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర శుక్రవారం నిజామాబాద్‌కు చేరుకుంది. యాత్ర అధ్యక్షుడు దొరాయ్ వేలు ఆధ్వర్యంలో కొనసాగుతున్న యాత్రకు డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ డీసీసీ ఇన్‌చార్జ్ కౌడపు శరత్ కుమార్ తదితరులు భవన్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన ఈ యాత్ర ‘క్విట్ టెర్రరిజం’ నినాదంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఆగస్టు 20న ఢిల్లీకి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుందని ఆయన వెల్లడించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ, జాతీయ సమైక్యత, శాంతి, సద్భావన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే యాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి భక్తవస్తలం, ఏఐసీసీ కో-ఆర్డినేటర్ గన్ రాజ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్, జెండా గుడి చైర్మన్ లవంగ ప్రమోద్, మాజీ కార్పొరేటర్ కుడ్డుస్, బంటు బలరామ్, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, అపర్ణ, ఆకుల మహేందర్, జాఫర్, రాజ్ గగన్, సుమీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
