Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 July 2025, 7:45 pm Posted by : ramakrishna

భారత రాజ్యాంగ సంరక్షనే బహుజనుల పంతం

  • ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

కామారెడ్డి, బతుకమ్మ : భారత రాజ్యాంగ సంరక్షనే బహుజనుల పంతం అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో కళాభారతి లో నిర్వహించిన “బహుజన అలయ్ బలయ్” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అన్న బిజెపి అహంకారాన్ని రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా అడ్డుకున్నామన్నారు. రాజ్యాంగాన్ని రద్దుచేసి మనువాదాన్ని తీసుకు రావాలనుకుంటున్న కలలు కలలుగానే మిగిలిపోతాయని తెలిపారు. కంచె ఐలయ్య లాంటి మేధావులు బయటకు వచ్చి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారని అన్నారు. దేశంలోనే మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో నే 42% రిజర్వేషన్ అమలు  మొదలు పెడుతున్నామన్నారు. స్థానిక ఎన్నికల్లో మనమందరం ఏకమై కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి సత్తా చాటాలన్నారు. బహుజనులందరూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని తెలిపారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కామారెడ్డి పట్టణంలో నిర్వహిస్తున్న బహుజన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల హక్కుల కోసం పోరాడిన మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ పెరియర్ రామస్వామి లాంటి మహానుభావుల ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించి పెట్టిన హక్కులు రిజర్వేషన్లు నేడు ప్రమాదంలోకి నెట్టబడుతున్నాయన్నారు. మన హక్కుల కోసం నిలబడి  కొట్లాడవలిసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్య రాజకీయ సాంఘిక ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు  బీసీ ఎస్టి ఎస్సి మైనార్టీల మైన మనమందరం ఒక్కటై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి మన రాజ్యాంగాన్ని కాపాడుకుందామని అన్నారు.

The protection of the Indian Constitution is the pledge of the majority.