అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
. . . అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ.రమేష్ బాబు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ.రమేష్ బాబు అన్నారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు పిలుపులో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ...