Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 5:39 pm Posted by : ramakrishna

ఇచ్చిన హామిలను వెంటనే అమలు చేయాలి

 

. . . సహించదు తెలంగాణ కార్యక్రమంలో భాగంగా వినతి పత్రం సమర్పణ

 

బోధన్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు “సహించదు తెలంగాణ” కార్యక్రమంలో భాగంగా బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు బోధన్ పట్టణ అధ్యక్షులు పసులేటి గోపి కిషన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు కాలేదని విమర్శించారు. ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు పెన్షన్ లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా పథకాలను అర్హులందరికీ తక్షణమే అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షులు పసులోటి గోపి కిషన్, మాజీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, కళ్యాణ లక్ష్మి తులం బంగారం, రైతు భరోసా, విద్యార్థినులకు స్కూటీలు వంటి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్, పట్టణ ప్రధాన కార్యదర్శులు రాజులదేవి పవన్ కుమార్, మీర్జాపురం అరవింద్, సీనియర్ నాయకులు వాసు, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు గౌతం గౌడ్, నాయకులు స్వప్నిల్, దుర్గా ప్రసాద్, శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీను, అనిల్, కిరణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

 

The promises made should be implemented immediately.