Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2024, 12:37 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి

  • నేటి సమ్మె ను జయప్రదం చేయండి
  • గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్ గౌడ్ డిమాండ్

బతుకమ్మ, జుక్కల్ :-రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ వర్కర్స్ కు పర్మినెంట్ చేసి వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చి 7 నెలలు కావస్తున్నా గ్రామ పంచాయతీ కార్మికుల ను పట్టించు కోవడం లేదని వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకపోతే గ్రామ పంచాయతీ కార్మికుల పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు.

పోరాటం లో బాగంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు లో సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ఆగస్టు 8 వ తేదీన ఒక్క రోజు సమ్మె ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్ గౌడ్ జిల్లా అద్యక్షులు బాలనర్సు,రాజన్న, మల్లేష్, శ్యాం, స్వామి తదితరులు పాల్గొన్నారు.