. . . బీసీ మహిళా జిల్లా అధ్యక్షురాలు బాజా లలిత
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో గతేడాది వచ్చిన వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పటికి అమలుకు నోచుకోవడం లేదని బీసీ మహిళా జిల్లా అధ్యక్షురాలు బాజా లలిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కామారెడ్డిలోని తన నివాసంలో లలిత విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాల అవుతున్న కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోకి జి.ఆర్ కాలనీలోకి వచ్చి వరదల ప్రాంతంలో కొట్టుకపోయినటువంటి డివైడర్స్ చూడడం జరిగిందని,సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు తట్టడే మొరంబోసిన పాపాన లేరని అన్నారు. రాత్రి సమయంలో కామారెడ్డి చీకటిమంగా మారుతుందని దానిని అదునుగా చేసుకొని దొంగలు బీభత్సంగా వస్తున్నారని, డివైడర్ పైన లైట్స్ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా మున్సిపల్ పరిధిలోని 49 వార్డులలో ఎక్కడికి అక్కడే చెత్తాచెదారం మురికి కాలువలు ఏరకపోతున్నాయని,మున్సిపల్ వార్డులలో మున్సిపల్ కార్మికులు కూడా లేక చెత్తాచెదారం పేరకపోతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి లోనే నామినేషన్ వేసి ఓడిపోయామని భయంతో కామారెడ్డి మున్సిపల్ కు నిధులు ఇవ్వడం లేదని నేను సూటిగా ప్రశ్న ఇస్తున్నానన్నారు.కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి బతకమ్మ పండగకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పడం తప్ప సద్దుల బతుకమ్మ రోజు చీకట్లో బతుకమ్మలు వేయడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఒక అభివృద్ధి పని చేసిన దాఖలాలు లేవని, కామారెడ్డి మున్సిపల్లో ఎవరు అవినీతికి పాల్పడిన వారి భరతం పడతానని ఎమ్మెల్యే కాకముందు చెప్పావని గెలిచి మూడు సంవత్సరాలు ఆవుతున్న మున్సిపల్ లో ఇంత అవినీతి జరుగుతున్న మీరు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. మీ సొంత మేనిఫెస్టో 150 కోట్లతో ప్రతి మండలంలో హాస్పిటల్ స్కూల్స్ నిర్మిస్తానని చెప్పి మూడు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు దాని ఊసే లేదని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే బీసీ సంఘం తరఫున మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామని హెచ్చరించారు.