కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ డిమాండ్ చేశారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా బాధ్యులు బుర్రి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టేస్తానని హామీ ఇచ్చిందన్నారు. గుడిసెలు వేసుకొని ఉన్నవారికి...