కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
ఐద్వా రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఆశలత నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఐద్వా రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఆశలత డిమాండ్ చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఆశలత హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆలిండియా కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ...