Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 September 2025, 5:27 pm Posted by : ramakrishna

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

  • ఐద్వా రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఆశలత

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఐద్వా రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఆశలత డిమాండ్ చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వర్క్ షాప్ నిర్వహించారు.  ఈ సమావేశానికి  రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఆశలత హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆలిండియా కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా,  కేంద్రం మతం పురుతో దాడులు చేస్తూ ప్రజల్లో ఐక్యతను  కోల్పోయే విధంగా చేస్తుందని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆరుగ్యారెంటీలో ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పటివరకు  ఇచ్చిన హామీలలో ఫ్రీ బస్సు తప్ప ఏ ఒకటి నెరవేర్చలేదన్నారు. ఇందిరమ్మ  ఇండ్లు, ప్రతి మహిళకు 2500 , వృద్ధాప్యత పింఛన్ కూడా పెంచుతామని, రూ.500 కి సిలిండర్,  ఉచిత కరెంటు  ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే విషయంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు.  స్థలం ఉన్న వారికి మేమే సొంత ఇల్లు  నిర్మించే ఇస్తామని చెబుతూనే  ప్రజలకు అనేక ఇబ్బందులు ప్రభుత్వాలు పెడుతున్నాయని అన్నారు.  ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా  ఐద్వా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి.సుజాత,  జిల్లా అధ్యక్షురాలు ఏ.అనిత, జిల్లా కమిటీ సభ్యులు శారద, కళ, కవిత, నగర నాయకురాలు రేఖ, యశోద, శ్రీదేవి, కే.లావణ్య, లక్ష్మీ రమాబాయి, మాధవి  తదితరులు పాల్గొన్నారు.

The promises made by the central and state governments must be fulfilled.