కన్నుల పండువగా బోనాల ఊరేగింపు
బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామంలో మంగళవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు నల్ల పోచమ్మ, దుర్గమ్మ దేవతలకు బోనాల పండుగను కన్నుల పండువగా జరిపించారు. గ్రామంలో ముదిరాజ్ మహిళలు పురుషులు ఇంటింటికి ఒక బోనం చొప్పున డప్పు చప్పుళ్ళు, డిజె చప్పుల మధ్య గ్రామంలోని నల్ల పోచమ్మ, దుర్గమ్మ ఆలయాల చుట్టూ బోనాల ప్రదక్షిణ నిర్వహించి అమ్మవార్లకు నైవేద్యాలను సమర్పించారు. అనంతరం సాయంత్రం మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ ఆలయం వరకు పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో గ్రామ మహిళలు,...