Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 4:41 pm Posted by : ramakrishna

ప్రజలను పట్టి పీడీస్తున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి

 

. . . సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే రానున్న కాలంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ప్రజల కోసం సీపీఎం కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిజామాబాద్ నగరంలో సిపిఎం  జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి గాంధీచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర  కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వి బి రాంజీ అనే పేరుతో మార్చడం కోసం కుట్రలు చేస్తుందని, ప్రజలకు ఉపయోగపడే చట్టాన్ని రద్దు చేసి, 4 లేబర్ కోడ్స్ మార్చి ప్రజలకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా రేపు వారి హక్కుల కోసం వాళ్లు పోరాటాలు చేయకుండా ప్రజలను అణిచివేతకు గురిచేస్తుందన్నారు. గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ప్రజలకు ఇంటి పట్టాలు ఇచ్చి, ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు మంజూరు చేయాలని, ఎస్సీ, ఎస్టీ వాళ్లకు 6 లక్షల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు 2500 రూపాయలు పెన్షన్ అమలు చేయాలని, అలాగే గ్యాస్ కొరత వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొరత లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని, పింఛన్లు, రేషన్ కార్డులు, నిత్యవసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ద వెంకట రాములు, జిల్లా కమిటీ సభ్యులు బెజ్గం సుజాత, సురేష్, విగ్నేష్, కొండ గంగాధర్, శ్రీనివాస్, నగర కమిటీ సభ్యులు నలవాల నరసయ్య, పార్టీ సభ్యులు దీపిక, అంజయ్య, శ్రీ దేవి, రజియా, సునీత, లలిత, జ్యోతి, అనిత, లక్ష్మి, సుందర్ బాయ్, రేష్మ, తదితరులు పాల్గొన్నారు.

 

The problems plaguing the people must be resolved immediately.