సింగరేణి ప్రాంతంలో ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు
. . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి ప్రాంతంలో కార్మికులు, రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రామగుండం, మంథని ప్రాంతాల్లోని బొగ్గు గనులను సందర్శించిన అనంతరం...