తెలంగాణ యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి

మెయిన్,సౌత్, బీఈడీ క్యాంపస్ ల సమస్యలు పరిష్కరించాలి పీ.డీ.ఎస్.యు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్, డాక్టర్ కర్క గణేష్ బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ యూనివర్సిటీ మెయిన్, సౌత్, బిఈడి క్యాంపస్ సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత (పీ.డీ.ఎస్.యు.) ఆధ్వర్యంలో తే.యూ. ఉపకులపతి ప్రొఫెసర్ యాదగిరిరావుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్, డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏర్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందన్నారు....