జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   ఆదిలాబాద్, బతుకమ్మ : జూనియర్ డాక్టర్స్, నర్సులు పేదవాళ్ల కోసం పనిచేస్తున్నారని, అలాంటి జూనియర్ డాక్టర్స్ డిమాండ్లు కొన్ని ఉన్నాయని వాటిని ప్రభుత్వం తీర్చాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనం బాటలో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ లోని రిమ్స్ హాస్పిటల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పరిశీలించి రోగుల ఇబ్బందులు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు....