గిరిరాజ్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం వినతి బతుకమ్మ, నిజామాబాద్ : నిజామబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల సమస్యలు పరిష్కరించాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డికి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.యస్.యు.) ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, కళాశాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగేష్, సలీం లు మాట్లాడుతూ, కళాశాలలోకి ఆకతాయిలు,గంజాయి సంబంధించిన వ్యక్తులు వస్తున్నారన్నారు. అటువంటి వారు రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా, కళాశాల చుట్టూరా సీసీ కెమెరాలు అమార్చాల్సిందిగా...