ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న కార్మిక సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్ మాట్లాడుతూ జిజిహెచ్ ఆసుపత్రి మరియు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, థర్డ్ పార్టీ, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి కార్పోరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు కార్మికులందరికీ సమాన పనికి...