రామడుగు పేదల భూముల సమస్య పరిష్కరించాలి
జాయింట్ సర్వే చేసి పట్టాలు ఇచ్చిన భూములను అప్పగించాలి సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్.రమేష్ ధర్పల్లి, బతుకమ్మ : మండలంలోని తాళ్లరామడుగు పేదల చెందిన భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తాం అని సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్ హెచ్చరించారు. సోమవారం ధర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు అఖిల భారత ఐక్య రైతు సంఘం( ఏఐయుకేఎస్ ) సిపిఐ (ఎంఎల్)మాస్ లైన్ ధర్పల్లి సిరికొండ మండలాల సంయుక్త కమిటీ...