Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 4:39 pm Posted by : ramakrishna

ప్రధాని సభను విజయవంతం చేయాలి

 

. . . వాల్ పెయింటింగ్  వేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఈనెల 10న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని మిర్చి కంపౌండ్ రోడ్లో శుక్రవారం వాల్ పెయింటింగ్ వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో సుమారు 8 వేల కోట్ల తో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,  ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు. 10న సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభకు ఇందూరు జిల్లా, నగర వాసులు భారీగా తరలిరావాలన్నారు. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న మోడీకి ఘనంగా ఆహ్వానం పలకాలన్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ లో విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ కి మరింత ఆదరణ పెరింగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇల్లెందుల ప్రభాకర్, దాంపల్లి మురళీ, బంటు ప్రవీణ్, కైరంకొండ మురళి తదితరులు పాల్గొన్నారు.

 

The Prime Minister should make the House a success.