. . . రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ రోషిని జైస్వాల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దేశంలో జరుగుతున్న నీట్ పేపర్ లీక్ పై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి, ప్రధాని రాజీనామా చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ రోషిని జైస్వాల్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం కేంద్ర విద్యా శాఖ మంత్రి, ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ భవన్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు వెళ్లి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ రోషిని జైష్వాల్, జిల్లా యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ వినోద్ ఎర్రంశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో యువకుల జీవితాలతో ఆడుకుంటూ వారి భవిష్యత్తును నాశనం చేసే విధంగా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పేపర్ లీక్ కార్యక్రమాలకు పాల్పడుతుందని, నీట్ పేపర్ లీక్ ద్వారా ఎంతో మంది యువకుల జీవితాలు రోడ్లపైకి వచ్చాయని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున యువకులు ఢిల్లీలో రోడ్లపైకి వచ్చే నిరసనలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వారిని పట్టించుకున్న పాపాన పోవడం లేదని, మాకు న్యాయం చేయాలని 20 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని, వారి కుటుంబ సభ్యులు ఎంతో బాధలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని వారన్నారు. యువకులకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ యువకుల పక్షాన చాత్రో కి గుంజ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, యువకులకు న్యాయం జరిగే వరకూ రాహుల్ గాంధీ పోరాటాన్ని కొనసాగిస్తారని ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం యువజన కాంగ్రెస్ పార్టీ ఆయన వెంటే ఆయనకు మద్దతుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అద్నన్, ప్రధాన కార్యదర్శి ఆదిత్య పాటిల్, ఇర్ఫాన్, రాజు గౌడ్, అసెంబ్లీ అధ్యక్షులు మహేందర్, మొయిన్ యూనుస్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీకాంత్, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
