Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 8:14 pm Posted by : ramakrishna

సనాతన హిందూ ధర్మంపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశం

 

. . . సద్గురు మహాదేవ స్వామీజీ

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

సనాతన హిందూ ధర్మంపై ప్రజల్లో అవగాహన, జాగృతిని కల్పించడమే మహాసభ ప్రధాన ఉద్దేశమని సద్గురు మహాదేవ స్వామీజీ పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ హనుమాన్ మందిరంలో సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం సద్గురు ఆధ్వర్యంలో విడుదల చేశారు. అంతకుముందు మహాసభ నిర్వహణకు సంబంధించి సన్నాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 న ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘంలో సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాసభను విజయవంతం చేసేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మహాసభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని స్వామీజీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, హిందూ ధర్మాభిమానులు, సన్నాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.