Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 5:47 pm Posted by : ramakrishna

రోజు రోజు కి నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి

 

. . . కేంద్ర ప్రభుత్వానికి సరైన గుణ పాఠం చెప్పాలి

 

. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రోజురోజుకీ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతూ ప్రజల నడ్డి విరుస్తున్నాయని, దీనికి కారణమైన ప్రభుత్వానికి  బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. మంగళవారం నగరంలోనీ హమల్ వాడి చౌరస్తాలో ఐద్వా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలో కి రాకన్న ముందు గ్యాస్ ధర రూ.450, పెట్రోల్, డీజిల్ రూ.55, మంచి నూనె ధర రూ.60 గా ఉండి నిత్యావసర ధరలు ప్రజలకు అనుకూలంగా ఉండేవన్నారు. కానీ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ధర రూ.1030 వరకు పెరిగిందని, పెట్రోల్, డీజిల్ ధర రూ.109 కి పెంచి అది కూడా సరిపోనట్టుగా ఈ నాలుగు రోజుల కాలంలో మరో రూ3.90 పైసలు పెంచారన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని వారి కూలి రేట్లు పెరగట్లేదని, గ్రామపంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ఆశాలు, అంగన్ వాడీల జీతాలు, అసంఘటిత కార్మికులు జీతాలు మాత్రం పెరగట్లేదని మండి పడ్డారు. కావున ప్రజలందరూ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఎలాంటి పిలుపునిచ్చిన కదలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ధరల పెంపు ఇలాగే కొనసాగితే కేంద్ర ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు స్వప్న, మాజిత, పర్వీన్, నాస్మిన్, నాగలక్ష్మి, దీపిక తదితరులు పాల్గొన్నారు.