పసుపు బోర్డు ఏర్పడిన తరువాత ధర తగ్గింది

హైదరాబాద్, బతుకమ్మ: పసుపు బోర్డు ఏర్పడక ముందు పసుపు ధర రూ.16వేల వరకు పలకగా, ఈ సంవత్సరం బోర్డు ఏర్పడిన తరువాత రూ.8వేల నుంచి రూ.9వేల ధర పలుకుతోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు రైతుల సమస్యలపై అసెంబ్లీ జీరో అవర్ లో ఆయన మాట్లాడారు. నిజమాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజమాబాద్ రూరల్, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల,  కోరుట్ల, నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల రైతులు పసును నిజామాబాద్ గంజ్...