Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 September 2024, 2:18 pm Posted by : ramakrishna

గత ప్రభుత్వం కక్ష సాధించింది

నిజామాబాద్, బతుకమ్మ: తనకు రాజకీయాలను ఆపాదించి, గత ప్రభుత్వం తనపై కక్షగట్టిందని రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్(రూరల్) గజవాడ హన్మంత్ రావు అన్నారు. ఆర్ అండ్ బీ సీఈ స్థాయికి ఎదిగిన జిల్లావాసి హన్మంత్ రావును దిశ సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్ పాల్, రాకేశ్ రెడ్డి సన్మానించారు. జిల్లాలో ఏఈగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి ఎస్ ఈగా పని చేసిన హన్మంత్ రావు జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా తనకు జిల్లాలో గత పాలకులు సహకరించారని, ఆ కారణంగానే తాను ఆర్ అండ్ బీ ద్వారా ఎన్నటికీ గుర్తుండే పనులు చేపట్టామన్నారు. కానీ గత ప్రభుత్వం తనకు రాజకీయాలను ఆపాదించి పదోన్నతి కారకుండా అడ్డుకుని వేధించిందని వాపోయారు.