Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 5:25 pm Posted by : ramakrishna

పేదలు ప్రభుత్వాసుపత్రి సేవలను వినియోగించుకోవాలి

 

. . . సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పేదలు ప్రభుత్వాసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని, అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీఎంఆర్ఎఫ్ నిధులను కేవలం 20 శాతం మాత్రమే చెల్లిస్తున్నారని, వీటిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడిచినా..ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. కొత్త పెన్షన్లు లేవని, ఆరోగ్య శ్రీ బిల్లులు సరిగా రావడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. రూ.500 గ్యాస్ సబ్సిడీ, ఉద్యోగులకు పదవీ విరమణ బెనిఫిట్స్ ఏదీ అమలు కావడం లేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ సక్రమంగా అమలవుతున్నాయని చెప్పారు. ఆరోగ్య సమస్యలు ఉన్న పేదలు తమ కార్యాలయంలో సంప్రదిస్తే ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేస్తామన్నారు. ఉత్తమ చికిత్స అందేలా చూస్తామన్నారు. అలాగే హైదరాబాదులోని బీబీనగర్ లో గల ఏయిమ్స్ లో అత్యాధునిక వైద్య సేవలు ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే నిమ్స్ లో చికిత్స పొందే వారికి తన ద్వారా ఎల్ఓసి అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్ లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, విజయ మల్లేష్ యాదవ్, జ్యోతి మురళి, కల్పే అర్చనా చిరంజీవి, సీనియర్ నాయకులు మాస్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

 

The poor should avail themselves of government hospital services.