పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

  . . . డీఎంహెచ్‌వో డా.బి.రాజశ్రీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ బి. రాజశ్రీ అధికారులను ఆదేశించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని సూచించారు. జూన్ 28న పోలియో బూత్‌ల...