న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బుధవారం నిర్మల్ న్యాయస్థానం పరిధిలో అడ్వకేట్  పి. అనిల్ కుమార్ వృత్తి పరమైన విధులు నిర్వహిస్తున్న సమయంలో పోలీసు సిబ్బంది ఆయన వాహనాన్ని న్యాయస్థాన ప్రాంగణంలో ధ్వంసం చేయడం, ఆయన విధులకు అడ్డంకులు కలిగించడం అత్యంత తీవ్రమైన, చట్ట విరుద్ధమైన చర్యగా  న్యాయవాద పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుందని పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సంఘటన న్యాయవాదుల గౌరవం, వృత్తి స్వాతంత్ర్యంపై ప్రత్యక్ష దాడిగా భావిస్తున్నామన్నారు. కోర్టు ప్రాంగణంలో పోలీసులు...