పోలీసులు తీరు మార్చుకోవాలి
హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ నేతల దాడిలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్ పేట్ గ్రామంలో దాడిలో గాయపడిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బిట్ల బాలరాజు, అతని భార్య గంజి భారతిని కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదన్నారు. ఈవిషయమై జిల్లా ఎస్పీకి ...