Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 December 2025, 1:40 pm Posted by : ramakrishna

పోలీసులు తీరు మార్చుకోవాలి

హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ నేతల దాడిలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని మాజీ మంత్రి  కేటీఆర్ పరామర్శించారు.  ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్ పేట్ గ్రామంలో దాడిలో గాయపడిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బిట్ల బాలరాజు, అతని భార్య గంజి భారతిని  కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.  కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదన్నారు.  ఈవిషయమై జిల్లా ఎస్పీకి  ఫోన్ చేసి మాట్లాడని తెలిపారు. పోలీసులకు జీతాలు ప్రజల సొమ్ము నుంచి ఇస్తున్నారని, కాంగ్రెస్ నేతల ఇవ్వడం లేదని విమర్శించారు. పోలీసులు తీరుమార్చుకోపోతే ప్రజలు తిరగబడతారని పేర్కొన్నారు. శాంతి భద్రతల సమస్య రాకుండా పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు బిగాల, జాజాల సురేందర్ ,  నాయకులు ఉన్నారు.

 Police are not registering a case against those responsible.