. . . కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన డీజీపీ శివధర్ రెడ్డి
వెబ్ డెస్క్, బతుకమ్మ :
తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ శాఖ నిబద్ధతతో పని చేస్తుందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ను హత్య చేసిన హంతకుడు రియాజ్ ఎన్ కౌంటర్ పై డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. నేరస్తులను కఠినంగా అణిచి వేస్తామని అన్నారు. రియాజ్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని అన్నారు. జిఓ ఆర్ టీ నెంబర్ 411 ప్రకారం కోటి రూపాయల ఎక్స్ గ్రేషీయా ప్రకటించారు. జిఓ 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం తో పాటు ,పోలీస్ శాఖ తరపున 16 లక్షల రూపాయలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషీయా అందిస్తుందని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున నివాళులు అర్పిస్తున్నట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.