Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 October 2024, 7:11 pm Posted by : ramakrishna

బైక్ దొంగలను పట్టుకున్న పోలీసులు

5 బైక్ లు రికవరీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు, రెండవ టౌన్ పోలీసులు సంయుక్తంగా ఇద్ధరు బైక్ దొంగలను పట్టుకుని 5 బైక్ లను రికవరీ చేశారు. నిజామాబాద్ సీసీఎస్ సీఐ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… శనివారం విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్, రెండవటౌన్ పోలీసులు నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో వాహనాల తనీఖీలు నిర్వహిస్తుండగా నగరంలోని డైరీ పారంకు చెందిన నీల నర్సింహ, మోపాల్ మండలం ముదక్ పల్లికి చెందిన ఫేరోజ్ ఖాన్ లు బైక్ పై వెలుతుండగా పట్టుకుని ప్రశ్నించారు. వారి వద్ధ బైక్ కు సంబందించిన పేపర్ లు లేకపోవడంతో దానిని దొంగ బైక్ గా నిర్ధారించి వారిని విచారించడంతో ఐదు బైక్ లు రికవరీ అయ్యాయి. వాటిలో 1,2,4,5పోలీస్ స్టేషన్ ల పరిధిలో చోరికి పాల్పడ్డవి గుర్తించినట్లు తెలిపారు. నర్సింహ, ఫెరోజ్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.