శాంతి భద్రతల పరిరక్షణ పోలీస్ బాధ్యత

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఎన్నికలు నిష్పాక్షపాతంగా నిర్వహణ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ  పోలీస్ బాధ్యత అని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఎన్నికలలో ఓటర్లను...