Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 December 2024, 4:59 pm Posted by : ramakrishna

ఉనికి కోసమే కాంగ్రెస్ పై కవిత అబద్దపు మాటలు

  • మాయమాటలు చెప్పడంలో కెసిఆర్ కుటుంబాన్ని మించిన వారు రాష్ట్రంలో లేరు
  •  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ : ఉనికి కోసం కల్వకుంట్ల కవిత అబద్ధాలు మాట్లాడుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేట్ పెరిగిందో, ఏ ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేట్ తగ్గిందో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.  మీరు సిద్ధమైతే తమకు చర్చకు రావాలన్నారు. టిఆర్ఎస్ హయాంలో చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పాపాలను కడుగుతూనే ప్రజలకు అభివృద్ధి పనులను చేస్తుందని తెలిపారు. కేవలం కాంగ్రెస్ ను విమర్శించాలనే ఆలోచనతోనే కవిత నిజామాబాద్ కు రావడం జరిగిందని అన్నారు. కానీ ఏ రోజు కూడా ఎంపీ, ఎమ్మెల్సీగా ప్రజలకు అందుబాటులో కవిత లేదని తెలిపారు. పోలీసులను తమ స్వార్థాల కోసం వినియోగించుకున్న వ్యక్తులు టిఆర్ఎస్ నాయకులని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతు సోదరులకు రెండు లక్షల లోపు రుణమాఫీ చేశామని తెలిపారు. అదేవిధంగా వంట గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే అందిస్తున్నామని, ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షల వరకు పెంచామని, పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ సమయంలో రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల ఆహారం గురించి పట్టించుకోక వారిని ఇబ్బందులకు గురి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డైట్, కాస్మెటిక్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నిజం షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందన్నారు. దానిని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుందని తెలిపారు. టిఆర్ఎస్ హయాంలో లాగా ప్రతిపక్ష ఎంఎల్ఏలను కట్టడి చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదని తెలిపారు. దానివల్లనే ఈరోజు టిఆర్ఎస్, బిజెపి ఎమ్మెల్యేలు ఎక్కడికైనా వెళ్లి ప్రభుత్వ అధికారులతో పనులు చేయించుకుంటున్నారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు కవితను మర్చిపోయారని కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడం వల్ల మళ్ళీ ప్రజలలో గుర్తింపు ఉంటుందని కవిత అనుకోవడం చూస్తుంటే ఆది ఆమె అవివేకానికి నిదర్శనమని అన్నారు.  ప్రజలు చేసిన అభివృద్ధిని మాత్రమే గుర్తుంచుకుంటారని దీనిని కవిత గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఏడాది పాలనలో ప్రజలకు రాక్షస పాలన నుండి విముక్తి లభించి ప్రజా పాలన అందించి ఇచ్చిన హామీలలో దాదాపు 80% హామీలను పూర్తి చేశామని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు పేరుతో రోడ్లకు, గుట్ట భూములకు ,వెంచర్ గా మారిన భూములకు డబ్బులు వేయడం జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కేవలం సాగు చేసే భూములకే రైతుబంధు వేయాలనే ఆలోచనతో సాగు చేసే భూమిని క్రమబద్ధీకరిస్తున్న సందర్భంలో రైతుబంధు కొంచెం ఆలస్యం అవ్వడం జరుగుతుందని, కానీ ఖచ్చితంగా త్వరలోనే సంక్రాంతికి ముఖ్యమంత్రి రైతుబంధు విషయంపై ప్రకటన విడుదల చేస్తారని తెలిపారు. పోలీసు వ్యవస్థ గతంలో కంటే భిన్నంగా ప్రజల రక్షణకే ముందుగా పనిచేస్తుందని, కేవలం కాంగ్రెస్ ను విమర్శించడం వల్ల కవిత గొప్ప వ్యక్తి కాదని ప్రభుత్వం చేసే మంచి పనులలో భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ వచ్చిన ఏడాది పాలనలో ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్నామని తెలిపారు.