Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 September 2024, 2:07 pm Posted by : ramakrishna

కవిత కనబడుట లేదు

The poem is not visible

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కనిపించడం లేదని జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు ఆదె ప్రవీణ్, కోనేరు సాయికుమార్, ఈర్ల శేఖర్ తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ వన్ టౌన్ ఎస్ హెచ్ వో కు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లక ముందు నుంచి కవిత నిజామాబాద్ ప్రజలకు కనిపించకుండాపోయారని, బెయిల్ పై బయటికి వచ్చిన తరువాత కూడా ఆమె ప్రజల్లోకి రాలేదన్నారు. ప్రజలు చెల్లించే పన్నుతో వేతనం, అలవెన్సులు తీసుకుంటున్న ఎమ్మెల్సీ ప్రజలకు కనిపించకుండాపోవడంతో తాము పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. ఆమె ఆచూకీ కొనుగోని ప్రజలకు తెలియజేయాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.