Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 December 2025, 7:45 pm Posted by : ramakrishna

 పోచారం కుటుంబం ఏ పార్టీలో ఉన్నారో జవాబు చెప్పాలి

కోటగిరి, బతుకమ్మ :       

 

పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబం ఏ పార్టీలో ఉన్నారు నియోజకవర్గ ప్రజలకు జవాబు చెప్పాలని కోటగిరి మాజీ ఎంపీపీ గంగాధర్ దేశాయ్ డిమాండ్ చేశారు. శనివారం కోటగిరిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో ఏనుగు రవీందర్ రెడ్డి ఎవరి గెలుపు కోసం పనిచేశారని ఆయన ఏ పార్టీలో ఉన్నారని పోచారం భాస్కర్ రెడ్డి ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. రుద్రూర్ సర్పంచ్ ఎన్నికల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శేఖర్ ను ఏనుగు రవీందర్ రెడ్డి సర్పంచ్ గా బరిలో నిలిపితే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన ఓడించేందుకు సంజీవరెడ్డిని ఎలా పోటీలో నిలిపారని ప్రశ్నించారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకులు ఎవరిని అభ్యర్థులుగా నిలిపితే వారే కాంగ్రెస్ అభ్యర్థులుగా గుర్తించాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఉంటుందని వారిని లెక్కచేయకుండా పోచారం కుటుంబం బాన్సువాడ నియోజకవర్గంలో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ ఏ పార్టీలో ఉన్నారో జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ కండువా వేసుకొని ప్రజల్లోకి రావాలని సవాలు విసిరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కొడుకులు చేస్తున్న రాజకీయాలను తీవ్రంగా తప్పు పట్టారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పై విమర్శలు మానుకోవాలని ఆయన నిజమైన కాంగ్రెస్ నాయకుడు అని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏనుగు రవీందర్ రెడ్డి కి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించిందని పోచారం శ్రీనివాసరెడ్డికి ఆయన కొడుకులకు ఎందుకు బాధ్యతలు ఇవ్వలేదు అని గుర్తు చేసుకోవాలని నిలదీశారు. బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం కుటుంబ సభ్యులు చేస్తున్న రాజకీయాలు దారుణంగా ఉన్నాయని ఇప్పటికైనా మానుకోవాలని నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు విలువ ఇవ్వాలని లేనట్లయితే రాబోయే రోజుల్లో ప్రజలు మరింత బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కోటగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్, వార్డు సభ్యులు మహమ్మద్ వాజిద్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ దాదు, షేక్ మునావర్, అబ్దుల్లా కుచ్, సాయిబాబా, అబ్దుల్ సోహెల్, షేక్ షకీల్ తదితరులు పాల్గొన్నారు