. . . జోరుగా జూదం
. . . ఇటు మూడు ముక్కలాట . . .అటు 13 ముక్కలు
. . . చేతులు మారినా కోట్ల రూపాయలు
. . . పండుగ ముసుగులో పత్తాలాట
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో పత్తాలాట జోరుగా సాగింది. ప్రతియేడు మాదిరిగానే దీపావళి పండుగ సందర్భంగా పేకలు తెగాయి. పండుగ నాడు జూదం ఆడడం అనే కల్చర్ ఉమ్మడి జిల్లాలో ఉంది. ఉత్తరాధి నుంచి వచ్చిన కల్చర్ కు తోడు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రా నుంచి వచ్చిన జూదం పండుగ వేళ ఇటు మూడు ముక్కలాట . . .అటు 13 ముక్కల పత్తాలాట జోరుగా సాగింది. ప్రధానంగా వాణిజ్య రంగంలో ఉన్న వారు పండుగ నాడు పత్తాలాడం అనే కల్చర్ సాధారణంగా ఉండేది. కానీ ఇప్పుడు పత్తాలాట చిన్న, పెద్ద తేడా లేకుండా సాగింది. పండుగ నాడు పూజల అనంతరం డబ్బులను సంపాదించాలని కొందరు, పొగొట్టుకుంటే మంచిదని మరికొందరు జోరుగా పేకాట ఆడుతారు. పూజలనంతరం ముహూర్తం నేపథ్యంలో జాగారం మాటున పత్తాలాట జోరుగా సాగింది. ఉమ్మడి రాష్ట్రంలో టెంట్లు వేసుకుని పత్తాలాడిన ఘనచరిత్ర ఉండేది. కానీ పత్తాలాటపై ప్రభుత్వం నిషేదించడంతో చాటుమాటుగా పత్తాలాట జోరుగా సాగింది. దుకాణాల్లో, అపార్ట్ మెంట్ లలో, ఫాంహౌజ్ లలో, ఇళ్ళలోనూ జోరుగా పత్తాలాట సాగింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోనే కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారాయి. బంగారం పెట్టి పత్తాలాడే ఘనచరిత్ర ఆర్మూర్ డివిజన్ లో ఉంది. దానికి తోడు పత్తాలాడితే అప్పటికప్పుడు అప్పులు ఇచ్చే కల్చర్ తో పాటు తనాఖా పెట్టి పత్తలాడించారు. ప్రభుత్వం పత్తాలాటపై నిషేదం విధించడంతో గేమింగ్ యాక్టులో పట్టుబడితే జరిమానాతో పాటు కేసులు మెడకు చుడుతాయని పత్తాలాట అంతా రహస్యంగానే సాగింది. పత్తాలాట మాత్రం ఆగలేదు. మూడు ముక్కలాట, రమ్మీ జోరుగా సాగింది. జిల్లా యంత్రాంగం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసిన పత్తాలాట మాత్రం సాగింది. ఆదివారం పత్తాలాట కేసుల విషయాలు మాత్రం బహిర్గతం కాలేదు. బోధన్ డివిజన్ లో పేకాట కేసులు నమోదైనట్లు సమాచారం. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ లలో జరిగిన పత్తాలాట కేసుల విషయాలు మాత్రం బయటకు పొక్కలేదు.
