కాళేశ్వరంపై కేసు వేసిన వ్యక్తి హత్య
భూపాలపల్లి, బతుకమ్మ : కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కేసు వేసిన నాగవెల్లి రాజలింగ మూర్తి హత్యకు గురయ్యాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, మేడి గడ్డ బ్యారేజీ 7వ బ్లాకులో పిల్లర్ కుంగిపోయిందని నాగవల్లి రాజలింగ మూర్తి భూపాలపల్లి కోర్టులో కేసు వేశారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంతి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఇంజనీరింగ్ అధికారులతో పాటు పలువురిని బాధ్యులను...