జీజీహెచ్ లో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి జైలుశిక్ష

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో న్యూసెన్స్ చేసిన అంతగిరి అఖిలేశ్ అనే వ్యక్తికి న్యాయస్థానం రెండు రోజుల జైలుశిక్ష విధించినట్లు ఒకటో టౌన్ ఇన్ స్పెక్టర్ రఘుపతి తెలిపారు. జీజీహెచ్ లో న్యూసెన్స్ చేశాడనే ఫిర్యాదు మేరకు అఖిలేశ్ పై   కేసు నమోదు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపర్చామన్నారు.