Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2024, 11:37 am Posted by : ramakrishna

దాడిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతు మృతి

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

కోందరి దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతు మృతి చెందాడు. ఈ సంఘటన సొమవారం వెలుగు లోకి వచ్చింది. నగరంలోని మహ్మదియా కాలనీకి చెందిన యాకుబ్ ఖాన్ (42) పై రెండు రోజుల క్రితం అసద్ బాబా నగర్ లో మద్యం మత్తులో జరిగిన ఘర్షణ లో దాడి జరిగింది . అసద్ బాబా నగర్ కు చెందిన ఇజాజ్, ఇలియాస్ అను వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో  యాకుబ్ ఖాన్  మెడలో నరాలు చిట్లి అపస్మారక స్థితిలో వెల్లాడు. అతడిని కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు  సొమవారం ఉదయం మృతి చెందాడు. యాకుబ్ సొదరుడు అయూబ్ ఖాన్ ఆరవ టౌన్ పొలిసులకు పిర్యాదు చేశారు. పొలిసులు ఈ మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.