Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 June 2025, 10:55 pm Posted by : ramakrishna

రైతులకు భరోసానిచ్చిన ప్రజా ప్రభుత్వం

  • తొమ్మిది రోజుల్లో తొమ్మిది కోట్ల రైతు భరోసానిచ్చిన సీ. ఎం రేవంత్ రెడ్డి

 

భీమ్ గల్, బతుకమ్మ : రైతు పెట్టుబడి సహాయం రైతు భరోసా పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ. 12 వేల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందించి ఈ ప్రజా ప్రభుత్వం రైతులకు భరోసానిచ్చిందని మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బోదిరే స్వామి అన్నారు. రైతు భరోసా నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన సందర్బంగా మంగళవారం పార్టీ కార్యాలయం లో సీ. ఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేసి, ఇప్పటి వరకు 1 కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లి కార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి వర్గానికి అందరికి భీమ్ గల్ మండల కాంగ్రెస్ పార్టీ, రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గతంలో ఎకరాకు రూ. 10వేల ఇవ్వగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.12 వేల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, ఎస్సీ సెల్ అనంతరావు,జిల్లా కార్యదర్శి బొజ గౌడ్, యువజన కాంగ్రెస్ అవినాష్, మహేష్,సురేష్,రాగుల మెహన్,శ్రీను,భుమేష, లింబాద్రి,నితిన్,శ్రీకాంత్,సతిష్,గొపాల్,సేవలల్,నారాయణ, సాయిలు,సూపర్ గౌడ్,కృష్ణ, రవి,కలీం,జుబేర్,అజార్,గంగ బాపు,సత్యనారాయణ,గంగారం,భాస్కర్,మురారి,జేమ్స్,రాజేశ్వర్,పృథ్వీరాజ్,సాగర్,శివ, దినేష్,రాము,నరేందర్,బలరాం,గంగాధర్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.