Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 10:05 am Posted by : ramakrishna

తెలంగాణ ప్రజలు బీజేపీ మాటలు నమ్మేటంత పిచ్చోళ్ళు కాదు

 

. . .డబుల్ ఇంజన్ అంటూ పేద ప్రజలను మోసం చేస్తున్నారు

. . . పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

 నిజామాబాద్, బతుకమ్మ:

తెలంగాణలో  బిజేపి పార్టీ ఇంజన్ డౌన్ అవుతుంది, ప్రజలు బీజేపీ మాటలు నమ్మేటంత పిచ్చోళ్ళు కాదు అని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్పందించి కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ పేద ప్రజలను మోసం చేస్తున్నారు అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న సీట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు. తాము చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలు ఆదరిస్తున్నారు అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.