పాలమూరు ప్రజలు రేవంత్ రెడ్డిని క్షమించరు

మహబూబ్ నగర్, బతుకమ్మ :  పాలమూరు ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని,  కాంగ్రెస్ పార్టీని క్షమించరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యనించారు. జాగృతి జనం బాటలో భాగంగా కవిత మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా  పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన కరివెన రిజర్వాయర్ సందర్శించి మీడియాతో మాట్లాడారు.  మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం చారిత్రక అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.  పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ లను సుప్రీంకోర్టు సస్పెన్షన్ లో పెట్టినా... రివ్యూ పిటిషన్ వేయకపోవటం దారుణమన్నారు. సీడ్ల్యూసీ...