Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 January 2025, 7:15 pm Posted by : ramakrishna

అధికారులను నిలదీసిన నర్సపూర్ గ్రామ ప్రజలు

బతుకమ్మ, కమ్మర్ పల్లి : అధికారులను గ్రామస్థులు నీలదీయడంతో మధ్యలోనే వెళ్ళిపోయినా ఘటన కమ్మర్ పల్లి మండలం లోని నర్సపూర్ గ్రామ సభలో చోటు చేసుకుంది.. మంగళ వారం గ్రామపంచాయతీ ఆవరణలో అధికారులు గ్రామ సభ నిర్వహించారు.

The people of Narsapur village who deposed the officials

నర్సాపూర్ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని అధికారులను నిలదీశారు. రేషన్ కార్డు కొరకు కొందరు ప్రశ్నిస్తే, ఇందిరమ్మ ఇండ్ల కొరకు మరికొందరు ప్రశ్నించారు. సాగు చేయని భూముల వివరాలు ఎలా తొలగిస్తారని పెద్ద ఎత్తున గొడవ జరగడంతో అధికారులు మధ్యలోనే అక్కడినుండి వెనుతిరిగారు. గ్రామ ప్రజలు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున దీనిపై నిలదీయడంతో ఏమీతోచని స్థితిలో అధికారులు సైలెంట్ గా వెళ్లిపోయారు.

The people of Narsapur village who deposed the officials