Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 April 2025, 6:10 pm Posted by : ramakrishna

పెన్షన్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెన్షన్ రూల్స్ ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో  బిల్లును ప్రవేశ పెట్టడం దుర్మార్గమని, తక్షణమే దానిని ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు, రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. పెన్షనర్లను రెండు తరగతులుగా విభజించే బిల్లును, పాత పెన్షనర్స్ కు పే రివిజన్ తర్వాత పెన్షన్ పెరుగుదల ఉండదని అనటం గతంలో సుప్రీంకోర్టు,  ప్రభుత్వం చేసిన చట్టాలకు విరుద్ధంగా ఉందని, బిజెపి ప్రభుత్వం పెన్షనర్ల పట్ల, సీనియర్ సిటిజన్ల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందని కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల యూనియన్ నాయకులు ఈవియల్ నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సాయన్న, పోస్టల్ యూనియన్ రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు ప్రతాపరెడ్డి, షేక్ హుస్సేన్,రత్నయ్య, ఎండీ.అమీన్, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల యూనియన్ నాయకులు మదన్ మోహన్, శిర్ప హనుమాడ్లు అద్దంకి ఉషాన్ తదితరులు ఉన్నారు.

The Pension Amendment Bill should be withdrawn.