కదంతొక్కిన కలం కార్మికులు
. . . ఐఅండ్ పీఆర్ కమీషనరేట్ ముట్టడి . . . వివక్ష వీడకపోతే రాష్ట్రవ్యాపిత ఆందోళన హైదరాబాద్, బతుకమ్మ : జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబభిస్తున్న నిర్లక్ష్యవైఖరి, వివక్ష ధోరణికి నిరసనగా అనేక మంది జర్నలిస్టులు బుధవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ (ఐఅండ్ పీఆర్) కమీషనర్ కార్యాలయం (సమాచార భవన్)ను ముట్టడించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఇచ్చిన రాష్ట్రవ్యాప్త జర్నలిస్టుల "ఛలో హైదరాబాద్" కార్యక్రమం...