కాంగ్రెస్ ఏలుబడిలో రైతాంగం కంటతడి

యూరియా కొరత అన్నదాతలకు గుండెకోత రుణమాఫీ ఒక నాటకం, రైతు భరోసా ఒక బూటకం బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్  ప్రభుత్వ కర్కశ ఏలుబడిలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం కంటతడి పెడుతోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రంగా ఉన్న యూరియా కొరత అన్నదాతలకు గుండెకోత మిగిలిస్తోందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏర్పడిన యూరియా కొరత కారణంగా కలత...