Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2024, 4:35 pm Posted by : ramakrishna

పోలీస్ అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం

  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
  •   పోలీస్ అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వారి ఆశయాలు కొనసాగిద్దాం:
  • జిల్లా ఎస్పీ సింధు శర్మ
    కామారెడ్డి, బతుకమ్మ : పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, వారి కుటుంబలకు  జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రగడ సానుభూతి తెలియజేశారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు 300 గజాల ప్లాటు పత్రాలు జిల్లా కలెక్టర్, ఎస్పీ అందజేశారు.  జిల్లా పోలీస్ ఆవరణలో నూతనంగా నిర్మించిన అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులు,పోలీస్ అధికారులతో కలసి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. కామారెడ్డి జిల్లాలో అంతర్గత భద్రత పరిరక్షణ విధుల్లో 07 మంది పోలీసులు అసువులు బాసారని,వారి త్యాగ ఫలం వల్లే గతం కంటే ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా ఉందని,పోలీసుల త్యాగనిరతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని,ప్రజావసరాల కోసం, సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు.శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు.శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో శాంతి స్థాపన కోసం అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరనీయమని , అమరవీరులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్రత, రక్షణ చర్యల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉందని తెలిపారు. దేశ సరిహద్దుల్లోని ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో పహార కాస్తున్న 10 మంది సిఆర్పిఎఫ్ పోలీసులను 1959లో ఇదే రోజున చైనా దేశానికి చెందిన సైనికులు హతమార్చారని, అప్పటినుండి వారి త్యాగాలను స్మరిస్తూ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినం జరుపుకోవడం జరుగుతున్నదని పేర్కొన్నారు. విధి నిర్వహణ సందర్భంగా ఎన్నో జటిలమైన సవాళ్లు ఎదురవుతున్నా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈసంవత్సరంలో తీవ్రవాదులు,సంఘ విద్రోహక శక్తుల్లో 214 మంది పోలీసులు అమరులయ్యారనీ, వారి త్యాగాలను స్మరించుకుంటూ వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమం, వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను సర్వస్వం లభింపచేయడం,అయా కుటుంబాలకు మానసిక బలాన్ని అందించటమే పోలీసు అమర వీరులకు మనం అందించే నిజమైన నివాళి పేర్కొన్నారు.
    పోలీస్ అమరవీరుల స్మరిస్తూ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు నుండి 31 తేదీ వరకు రక్తదాన శిబిరాలు,,ఓపెన్ హౌస్, వ్యాసరచన పోటీలు, ఫోటో, వీడియో పోటీలు నిర్వహించడం జరుగుతుందని,పోలీస్ అమరవీరుల కుటుంబాలకు దగ్గరికి వెళ్లి వారి త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
    ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి గారు, కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు, ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు, డిఎస్పి యాకూబ్ రెడ్డి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జార్జ్, తిరుపయ్య, సిఐలు చంద్రశేఖర్ రెడ్డి, సంపత్ కుమార్, సంతోష్ కుమార్, శ్రీనివాసులు, ఆర్ఐ కు నవీన్ కుమార్, సంతోష్ కుమార్, కృష్ణ, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మను రాజన్న, ఎస్ఐలు, సిబ్బంది మరియు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
  • The peace and brotherhood seen today is the result of the sacrifices of police martyrs