దైవమార్గమే ప్రశాంత జీవనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రశాంత జీవనానికి దైవమార్గం ఒక్కటే సరైనదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లో ఉన్న ఉమా మహేశ్వర స్వామి ఆలయం 25వ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. హిందువులుగా ప్రతి ఒక్కరు ఐక్యతతో మన సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ భావి తరాలకు వాటిని అలవాటు చేయాలని సూచించారు. హిందూ దేవాలయలపై జరుగుతున్న దాడులను ముక్త0కంఠంతో ఖండించాలని, దెబ్బతిన్న ఆలయాల పునః నిర్మాణానికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. దేవాలయాల అభివృద్ధికి తను ఎల్లప్పుడూ అండగా...