Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2025, 2:37 pm Posted by : ramakrishna

దైవమార్గమే ప్రశాంత జీవనం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రశాంత జీవనానికి దైవమార్గం ఒక్కటే సరైనదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లో ఉన్న ఉమా మహేశ్వర స్వామి ఆలయం 25వ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. హిందువులుగా ప్రతి ఒక్కరు ఐక్యతతో మన సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ భావి తరాలకు వాటిని అలవాటు చేయాలని సూచించారు. హిందూ దేవాలయలపై జరుగుతున్న దాడులను ముక్త0కంఠంతో ఖండించాలని, దెబ్బతిన్న ఆలయాల పునః నిర్మాణానికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. దేవాలయాల అభివృద్ధికి తను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ప్రకటించారు. అనంతరం దేవాలయ ట్రస్ట్ సభ్యులను ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, ధన్ పాల్ దత్తాత్రి, మాస్టర్ శంకర్, లాభిశెట్టి శ్రీనివాస్, రామ్ స్వరూప్ దాలియా, కమల్ ఇనానీ తదితరులు పాల్గొన్నారు.

The path of God is a peaceful life.