పార్టీ బలపడేది కార్యకర్తల అంకితభావంతోనే
ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పార్టీ బలపడేది కార్యకర్తల అంకితభావం ద్వారానే అని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన అర్బన్ నియోజకవర్గం స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిధి గా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరేలా...